Monday, November 18, 2024

Arilines: అమెరికా ఎయిర్‌లైన్స్‌పై 5జీ ఎఫెక్ట్‌.. లో విజుబులిటీతో ల్యాండింగ్‌ ఇష్యూ..

అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం (నేడు) నుంచి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే 5జీ టెక్నాలజీ ఏర్పాటు సమ యంలో అమెరికాలో విమానయాన సంక్షోభం తలెత ్తబోతోందని అమెరికాకు చెందిన ఎయిర్‌లైన్స్‌ ఆం దోళన వ్యక్తం చేస్తున్నాయి. విమాన ప్రయాణంలో కీలకమైన ఆల్టిdమీటర్‌ వంటి పరికరాలపై కొత్త సీ- బ్యాండ్‌ ప్రభావం పడుతుంది. అంతేకాకుండా తక్కు వ దృశ్యత (లో -విజిబిలిటీ) పరిస్థితుల్లో విమానాలు ల్యాండవ్వడం సాధ్యపడదని పేర్కొన్నాయి. ముఖ్యం గా బోయింగ్‌ వంటి పెద్ద విమాన సర్వీసులు సాధ్యం కాదని తెలిపాయి. ఏటీఅండ్‌టీ, వెరిజోన్‌ కంపెనీలు 5జీ టెక్నాలజీ సర్వీసులను బుధవారం మోహరించ నున్నాయి. ఈ సమయంలో విమాన సర్వీసులకు అం తరాయం ఏర్పడుతుంది. ఈ ప్రభావంతో పెద్ద సంఖ్య లో విమానాల సర్వీసులు దెబ్బతింటాయి.

విదేశాల్లో చిక్కుకున్న అమెరికన్లు పెద్ద సంఖ్యలో చిక్కుకునే అవకాశం ఉంది. యూఎస్‌ ఫ్లైట్స్‌ విషయంలో ఆం దోళనలు తప్పకపోవచ్చునని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. ప్రధాన హబ్‌ల నుంచి విమానాలు ఎగిరేసేందుకు క్లియరెన్స్‌ వస్తే తప్ప ఎయిర్‌పోర్టుకు పరిమితమైన విమానాలు కదిలే అవకాశం ఉందని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌, యూనైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌, సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఇతర విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. ప్ర భుత్వాన్ని జోక్యం చేసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిని స్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ)కి లేఖ రాశా యి. కాగా ఇప్పటికే 5జీ సర్వీ సుల మోహరింపు ప్రభావంతో సోమవారం ఒక్క రోజే 1100లకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.

దాదాపు లక్ష మంది ప్రయా ణికులు విమాన రద్దు, వాయిదా లేదా డైవర్సన్‌ పరి స్థితులను అనుభవించారని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. కాగా ఏటీఅండ్‌టీ, వెరిజాన్‌ కంపెనీలు దాదాపు 80 బిలియన్‌ డాలర్లతో గతేడాది అమెరి కాలో సీ-బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్నాయి. విమాన సేవల్లో అంతరాయాలు ఏర్పడకుండా 50 ఎయిర్‌ పోర్టులకు బఫర్‌ జోన్లు ఏర్పాటు చేసేందుకు జనవరి 3న అంగీకరించాయి. ఆరు నెలలపాటు ఇతర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాయి. విమానయాన రంగం భద్రత నిమిత్తం 5జీ టెక్నాలజీ మోహ రింపును బుధవారం(నేటి) వరకు వాయిదా వేసేందు కు కూడా అంగీకరించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement