త్వరలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో 5జీ నెట్ వర్క్ కు సంబంధించిన పరికరాలను, నెట్ వర్క్ ను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా పలు నగరాలను ఎంపిక చేశారు. వారు ఎంపిక చేసిన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉండటం విశేషం. ఈ 5జీ నెట్ వర్క్ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ తుది దశలో ఉంది. డిసెంబర్ 31నాటికి పూర్తవుతుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) తెలిపింది. దేశవ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ టెస్ట్ చేయడానికి 13నగరాలను ఎంపిక చేశాయి ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, జియో, వోడో ఫోన్, ఐడియాలు. ఈ నగరాల జాబితాలో హైదరాబాద్ తో పాటు చెన్నై, ఢిల్లీ, ముంబై, గురుగావ్, పూణే, బెంగుళూరు, చండీగఢ్, కోల్‌కతా, జామ్‌నగర్, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో గాంధీ నగర్ వంటి పెద్ద నగరాలున్నాయి. ఈ నగరాల్లో 5జీ సేవలపై ట్రయల్ రన్ నిర్వహించనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..