Saturday, November 23, 2024

శివ‌మొగ్గలోని ‘క‌ర్ణాట‌క ప‌బ్లిక్ స్కూల్’ లో 58మంది విద్యార్థుల స‌స్పెండ్

శివ‌మొగ్గ‌లోని క‌ర్ణాట‌క ప‌బ్లిక్ స్కూల్ యాజ‌మాన్యం హిజాబ్ ఆందోళ‌న‌లో పాల్గొన్న 58మంది విద్యార్థుల‌ను స‌స్పెండ్ చేసింది. ఈ విద్యార్థ‌/ల‌ంతా హిజాబ్ త‌మ హ‌క్కు అంటూ నిన‌దిస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గా తాము కేసును తేల్చే వ‌ర‌కు మతపరమైన వస్త్రాలు ధరించి స్కూళ్లకు వెళ్లొద్దని కర్ణాటక హై కోర్టు సూచించింది. అయినప్పటికీ కొంతమంది విద్యార్థులు హిజాబ్ ధరించి స్కూళ్లకు వస్తున్నారు. హిజాబ్ కు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న కొందరిమీద 144 సెక్షన్ ఉల్లంఘన కింద శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ముస్లిం వస్త్రధారణలో హిజాబ్ భాగం కాదని ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. స్కూళ్లలో యూనిఫాం ధరించాలన్న గవర్నమెంట్ ఆర్డర్స్ రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని అడ్వకేట్ జనరల్ అన్నారు. అయితే హిజాబ్ ధరించడం ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుందా లేదా అన్నది తేల్చాల్సి ఉందని చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement