Saturday, November 23, 2024

అకౌంట్ నుంచి 578 కట్ అయ్యాయని ఫోన్ చేస్తే, 1.78 లక్షలు మ‌టాష్‌.. అస‌లేం జ‌రిగిందంటే

ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. ఈ మ‌ధ్య‌ ఒక వ్యక్తికి కూడా ఇట్లానే జరిగింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)లో టికెట్ బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో ఆ డబ్బు రిఫండ్‌ కోసం ఒక‌త‌ను ట్రై చేశాడు. ఈ క్రమంలో ఏకంగా అత‌ను రూ.1.78 లక్షలు పోగొట్టుకున్నాడు. ట్యూషన్ టీచరుగా పనిచేసే ఓ వ్య‌క్తి నాసిక్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవడం కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేశాడు. అయితే.. సాంకేతిక కార‌ణంగా టికెట్ బుక్ కాలేదు. కానీ, అత‌ని ఖాతాలో రూ.578 క‌ట్ అయ్యాయి.

దీంతో ఆ డ‌బ్బుల రిఫండ్ కోసం ప్రయత్నించాడు. ఐఆర్‌సీటీసీ హెల్ప్‌లైన్ నెంబరు కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఒక నెంబరు దొరికింది. అత‌ని దుర‌దృష్టం ఏమో కానీ అది కూడా ఒక సైబర్ మోసగాడిది అని ఆ త‌ర్వాత తెలిసింది. ఈ విషయం తెలియని బాధితుడు ఆ నెంబర్‌కు కాల్ చేశాడు.. దీంతో అత‌ను మ‌రోసారి మోస‌పోయాడు. ఈ సారి ఏకంగా రూ.1.78 లక్షలు అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాయి. దీంతో తను మ‌రోసారి మోసపోయానని తెలుసుకున్న ట్యూషన్ టీచర్.. పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement