Wednesday, November 20, 2024

దేశంలో కొత్తగా 54 వేల కేసులు..

దేశంలో పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,069 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,82,778కి చేరింది. ఇందులో 6,27,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 68,885 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,90,63,740కి చేరింది. అటు నిన్న 1,321 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,91,981 చేరుకుంది.

అలాగే ఇప్పటిదాకా 30.2 కోట్ల(30,16,26,028) వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.61 శాతంగా ఉందని.. మరణాల రేటు 1.30 శాతంగా ఉందని తెలిపింది. కాగా, కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలుపెట్టాయి.

ఎక్కువ పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో వెలుగు చూస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటిదాకా దేశంలో మొత్తం 40 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు అయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందులో మహారాష్ట్రలో 21 కేసులు, మధ్యప్రదేశ్ 6, కేరళ 3, తమిళనాడు 3, కర్ణాటక 2, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూలలో ఒక్కొక్క కేసు వెలుగు చూసినట్లు తెలుస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement