Friday, November 22, 2024

ఎయిర్ ఇండియా సంస్థ‌లో.. మ‌రో 500విమానాలు

ఫ్రాన్స్ కి చెందిన ఎయిర్ బ‌స్..ప్ర‌త్య‌ర్థి సంస్థ బోయింగ్ నుండి ఎయిర్ ఇండియా కొత్త విమానాల‌ను ఖ‌రీదు చేయ‌నుంద‌ట ఎయిర్ ఇండియా సంస్థ‌. ఈ మేర‌కు సుమారు 500విమానాలు కొనుగోలు చేయ‌నుంది. దీని కోసం ఆ సంస్థ డీల్ కూడా కుదుర్చుకున్న‌ట్లు నివేదిక‌లు వ‌స్తున్నాయి. దాదాపు 100 బిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌రీదైన ఆ ఒప్పందంపై త్వ‌ర‌లో ఓ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌నున్నారు. వ‌చ్చే వారం ఈ డీల్ గురించి ప్ర‌క‌ట‌న అధికారికంగా వెలుబ‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.
సుమారు 250 ఎయిర్‌బ‌స్ విమానాల‌ను ఎయిర్ ఇండియా ఖ‌రీదు చేయాల‌ని భావిస్తోంది. దాంట్లో 210 ఏ320, 40 ఏ350 విమానాలు ఉండ‌నున్నాయి. ఇక బోయింగ్ నుంచి 190 737 మ్యాక్స్‌, 787కు చెందిన 20 విమానాల‌ను కొనుగోలు చేయ‌నున్నారు. వీటి తోడు 777ఎక్స్ వెరైటీకి చెందిన మ‌రో ప‌ది బోయింగ్ విమానాల‌ను కూడా ఖ‌రీదు చేయ‌నున్నారు..ఎయిర్‌బ‌స్‌, ఎయిర్ ఇండియా సంస్థ‌లు త‌మ ఒప్పందంపై సంత‌కాలు చేశాయి. దీనిపై కామెంట్ చేసేందుకు ఎయిర్‌బ‌స్ నిరాక‌రించింది. బోయింగ్ సంస్థ‌తో కూడా త్వ‌ర‌లో ఒప్పందం కుదుర‌నున్న‌ది. ప్ర‌స్తుతం ఎయిర్ ఇండియాను టాటా సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement