Tuesday, November 26, 2024

సటర్న్ అవార్డ్స్ కి 50ఏళ్లు..ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ ఆర్ ఆర్

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డుకు ఎంపిక అయింది ఆర్ ఆర్ ఆర్ మూవీ. సటర్న్‌ అవార్డ్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు’కు ఎంపికైంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో నటించగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్ర‌లో న‌టించారు. ‌ఈ మూవీలో అలియాభట్‌, అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియాశరణ్‌, ఒలివియా మొర్రీస్‌, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సటర్న్‌ అవార్డ్స్‌ ఈ ఏడాదితో 50 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అమెరికన్‌ అవార్డును జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్‌ కు ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ధన్యవాదాలు తెలియజేశారు. ఇది తనకు రెండో సటర్న్‌ అవార్డు అని రాజమౌళి అన్నారు. అవార్డులు గెలుచుకున్న ఇతర విజేతలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు జక్కన్న. రాజమౌళి వీడియో ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. మొదటి అవార్డు బాహుబలి : ది కంక్లూజన్‌ చిత్రానికి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement