Tuesday, November 26, 2024

RBI : రూ.2వేల నోట్లు 50శాతం వెనక్కి వచ్చేశాయి.. ఆర్బీఐ

ఇటీవల రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు డబ్బులు మార్చుకునేందుకు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. మరికొందరు ఇంకా టైం ఉందిలే అంటూ కొంచెం ఆలస్యం చేస్తున్నారు. అయితే నోట్ల బదిలీకి ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువిచ్చింది. ఇప్పుడు తాజాగా రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది.

ఇప్పటికే చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 50శాతం నోట్లు వెనక్కి వచ్చేశాయని పేర్కొంది. నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 20 రోజుల్లోపే ఇది సాధ్యమైందని తెలిపింది. ఇప్పటివరకు వెనక్కి వచ్చిన ఈ 50శాతం నోట్ల విలువ రూ.1.82 లక్షల కోట్లని వెల్లడించింది. వీటిలో దాదాపు 85 శాతం ఓట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం వల్లే వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. మార్చి 31 నాటికి రూ.2 వేల నోట్లు రూ.3.62 లక్షల కోట్లు చలామణిలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు సగం నోట్లు వచ్చేశాయన్నారు. అయితే సెప్టెంబర్ 30 వరకు చివరి తేది ఉన్నందున్న చివరి సమయంలో నోట్లు డిపాజిట్ లేదా మార్చుకోవడం చేయొద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement