Wednesday, November 20, 2024

తెలంగాణలో 2.20 కోట్ల మందికి టీకా!

తెలంగాణలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.20 కోట్ల మందికి టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరి 16 నుంచి ఇప్పటివరకు మొత్తం 1.34 కోట్ల మందికి టీకాలు వేశారు. ఇందులో మొదటి డోస్‌ తీసుకున్నవారి సంఖ్య 1.09 కోట్లు కాగా, రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య దాదాపు 28 లక్షలుగా ఉంది. రెండు డోసుల మధ్య గడువును కేంద్ర ప్రభుత్వం 12 నుంచి 16 వారాలకు పెంచడంతో కొవిషీల్డ్‌ తీసుకున్నవారు ఇప్పుడు రెండో డోస్‌ తీసుకుంటున్నారు.

ప్రభుత్వం మొదటి డోస్‌ను అందిస్తూనే, రెండో డోస్‌ వారికి ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తమకు అధిక వ్యాక్సిన్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. జూలై నెలకు కేటాయించిన 18 లక్షల వ్యాక్సిన్లకు అదనంగా మరో 4 లక్షలను కేంద్రం కేటాయించిందని వైద్యవర్గాలు తెలిపాయి. జూలై చివరినాటికి రాష్ట్రంలో రెండో డోస్‌ తీసుకొనేవారు 20 లక్షలు, ఆగస్టు నాటికి మరో 10 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 18-44 ఏళ్ల వయసున్న 1,45,44,846 మంది కోవిడ్ టీకా తీసుకున్నారు. 45 ఏళ్లు పై బడిన 74,92,799 మందికి వ్యాక్సిన్ వేశారు. మొత్తం 2,20,37,645 మందికి కరోనా టీకా వేశారు. ఇందులో మొదటి డోస్‌ తీసుకున్నవారు 50 శాతం దాటగా, రెండు డోసులు తీసుకున్నవారు 25 శాతం దాటారు.

ఇది కూడా చదవండిః జీరో కేసుల దిశగా తెలంగాణ.. ఆ జిల్లాలో ఒక్కరికే కరోనా!

Advertisement

తాజా వార్తలు

Advertisement