బిగ్ బాస్ 5 పదో వారంలో అడుగు పెట్టింది. తొమ్మిదో వారంలో విశ్వ హౌజ్‌లో బయటకు వచ్చాడు. దీంతో సోమవారం నామినేషన్ ప్రక్రియ సాగింది. ఈ వారం మానస్, సిరి, సన్నీ, రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన బిగ్ బాస్.. హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న ఆనీ మాస్టర్ ను ఇంటిలో ఉన్న నలుగుర్ని డైరెక్ట్‌గా నామినేట్ చేసి.. జైలులో బంధించాలని సూచించాడు.
దీంతో ఆనీ మాస్టర్ ఫస్ట్ కాజల్‌ని నామినేట్ చేసి జైలులో వేసింది. ఆ తరువాత సన్నీని నామినేట్ చేస్తూ.. ఇప్పటివరకూ అందర్నీ నామినేట్ చేశాను కానీ నిన్ను నామినేట్ చేయలేదు అందుకే ఈవారం సన్నీని చేస్తున్నా అంటూ చెప్పింది. ఆ తరువాత మానస్, షణ్ముఖ్‌లను నామినేట్ చేసింది. మొత్తంగా ఫస్ట్ లెవల్ నామినేషన్స్‌లో హౌస్ కెప్టెన్‌గా ఉన్న ఆనీ మాస్టర్.. మానస్, షణ్ముఖ్, కాజల్, సన్నీ ఈ నలుగురిని నామినేట్ చేసింది.
అయితే, బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఆనీ మాస్టర్ చేసిన నామినేషన్‌ని మార్చే అవకాశాన్ని మిగిలిన ఇంటి సభ్యులకు ఇచ్చారు. బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న సంకెళ్లను పట్టుకుని వాటి ద్వారా తమకి ఇష్టమైన వాళ్లని విడిపించవచ్చని చెప్పారు. ఆ విడుదలైన సభ్యుడు హౌస్‌లో ఉన్న ఇద్దర్ని నామినేట్ చేయొచ్చని చెప్పారు. ఆ ఇద్దరు ఒకరు నామినేట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో మానస్, సిరి, సన్నీ, రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు.