Tuesday, November 19, 2024

రెండు వేర్వేరు ఎన్‌కౌంట‌ర్లలో అయిదుగురు మావోయిస్టులు మృతి.. కానిస్టేబుల్‌కు తీవ్ర‌ గాయాలు

ఛత్తీస్గఢ్, తెలంగాణ బోర్డర్లోని సుక్మా జిల్లాలో మంగళవారం ఉదయం రెండు వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళ సహా అయిదుగురు మావోయిస్టులు చనిపో యినట్టు పోలీసులు తెలిపారు. సుక్మా జిల్లాలో సుక్మా, దంతెవాడ, బస్తర్ ఏరియాలో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG)కి మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో మహిళా మావోయిస్టు చనిపోయారని, ఆమెపై ₹ 5 లక్షల రివార్డు ఉందని పోలీసు అధికారి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దు అడవుల్లో తెల్లవారుజామున మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి.

మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌తో పాటు 40 మంది సాయుధ నక్సల్స్‌ కదలికలపై ఇన్‌పుట్‌లు అందడంతో పొరుగున ఉన్న తెలంగాణ పోలీసుల ప్రత్యేక యాంటీ నక్సల్ గ్రేహౌండ్స్ బృందం బీజాపూర్ (ఛత్తీస్‌గఢ్), ములుగు (తెలంగాణ) జిల్లాల అటవీప్రాంతంలో యాంటీ నక్సల్స్ స్వ్కాడ్ ఆపరేషన్ చేపట్టిందన ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ తెలిపారు.

బీజాపూర్ నుండి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆపరేషన్‌లో చేపట్టింది. “ఉదయం 7 గంటలకు, గ్రేహౌండ్స్ టీమ్ సెమల్దొడి గ్రామం (బీజాపూర్), పెనుగోలు గ్రామం (ములుగు) సమీపంలోని అడవిలో కాల్పులు జరిపింది. ఆ తర్వాత ఘటనా స్థలం నుండి నాలుగు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, ”అని అతను ఐజీ చెప్పారు. ఒక గ్రేహౌండ్స్ జవాన్‌కు గాయాలయ్యాయని, ఆ తర్వాత అతన్ని హెలికాప్టర్‌లో వరంగల్‌కు తరలించి ఆసుపత్రిలో చేర్చినట్లు ఐజీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాజధానికి 450 కి.మీ దూరంలో ఉన్న ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement