Tuesday, November 26, 2024

47ఏళ్ల ‘మ‌లైకా అరోరా’ – గ్లామ‌ర్ సీక్రెట్స్ ఇవే

ఆమె వ‌య‌సు 47ఏళ్లు..ఇప్ప‌టి వ‌న్నె త‌ర‌గ‌ని అందం..యంగ్ హీరోయిన్ ల‌కి పోటీ ఇచ్చేలా ఫిట్ నెస్ తో మెరిసిపోతుంటుంది బాలీవుడ్ భామ మ‌లైకా అరోరా..ఈ భామ టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మే. ప‌లు ఐటెం సాంగ్స్ లో మెరిసింది. కెవ్వు కేక అంటూ కేక‌పెట్టించింది. ఈ ఏజ్ లో కూడా ఇంత‌టి గ్లామ‌ర్ తో మెరిసిపోవ‌డం అంత ఈజీ కాదు. మ‌రి మ‌లైకా అరోరా త‌న గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.. యోగా, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌తో నా దినచర్య ప్రారంభం అవుతుంది. పొద్దున గోరువెచ్చని నీటితో నిమ్మరసం కలుపుకొని తాగడం నాకు అలవాటు. ఆకుపచ్చని కూరగాయలు లేదా పండ్లతో చేసిన గ్రీన్‌ స్మూతీ నా బ్రేక్‌ఫాస్ట్‌. అనంతరం డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటా. ఇంటి భోజనానికే నా ప్రాధాన్యం. భోజనంలో కూరగాయలు, అన్నం, పప్పు, పచ్చడి ఉండేలా చూసుకుంటాను.

సాయంకాలం స్నాక్స్‌ అంటే నా వరకు పండ్లు మాత్రమే. ఇక రాత్రికి ఒక పెద్ద కప్పు సలాడ్‌ లేదా ఫిష్‌. ఇదీ సాధారణంగా నా రోజువారీ డైట్‌ ప్లాన్‌. నేను నాన్‌వెజిటేరియన్‌ని. ఏది తినాలనిపిస్తే అది తినేందుకే మొగ్గుచూపుతా. బిర్యానీ, చేపలకూర అంటే ఇష్టం. నా ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను. పాలు, పాల పదార్థాలు నా మెనూలో అస్సలు కనిపించవు. బాల్యం నుంచీ వంటింట్లో అమ్మకు సాయం చేయడం అలవాటు. వంట చేయడం వచ్చు. మలబార్‌ చేపలకూర బాగా వండుతాను. కానీ అమ్మకంటే బాగా మాత్రం కాదు. నాకు పాలకూర ఇష్టం. దీనిలో పోషకాలు అపారం. కంఫర్ట్‌గా ఫీలయ్యే ఆహారం పప్పన్నం. ఇష్టమైన స్వీట్లు బేసన్‌ లడ్డూ, చాక్లెట్లు. ప్రతి మీల్‌ని ఎంజాయ్‌ చేస్తాను. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. అందరూ ఒకే రకమైన ఫుడ్‌ తినాలని లేదు. నేను పాల పదార్థాలు తినను. అలా అని, అందరూ తినకూడదని కాదు. వాటిలోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీర తత్వాన్ని తెలుసుకుని తినడమే అసలైన ఆరోగ్య రహస్యం అని తెలిపింది మ‌లైకా.

Advertisement

తాజా వార్తలు

Advertisement