జవాద్ తుపాన్ అలజడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు అత్యవసర సహాయం కోసం 46 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ ఎఫ్) టీమ్‌లను పంపినట్టు ఎన్‌డీఆర్ ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. ఈ బృందాలు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సహాయక చర్యలు అందిస్తాయన్నారు.
ఆయా రాష్ట్రాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ టీమ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా మరేదైనా అత్యంత ఎమర్జెన్సీ అయితే కనుక ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు ఐడీఎఫ్ టీమ్స్ కూడా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా మరో 18 బృందాలు స్టాండ్ బైలో కూడా ఉంచినట్ఉటు తెలిపారు అతుల్ కర్వాల్..