Saturday, November 23, 2024

Omicron: దేశంలో ఒమిక్రాన్ విజృంభణ.. 422కి చేరిన కేసులు

భారతదేశంలో కూడా ఓమిక్రాన్ విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 422కి పెరిగింది, మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. అదే సమయంలో ఇప్పటి వరకు 130 మంది ఓమిక్రాన్ బారి నుంచి కోలుకున్నారు.

దేశంలో ఒక్క మహారాష్ట్రలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 108కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఓమిక్రాన్ కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంది. ఢిల్లీలో 79 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో 43, తెలంగాణలో 41, కేరళలో 38, తమిళనాడులో 34, కర్ణాకటలో31, రాజస్థాన్ లో 22, పశ్చిమ బెంగాల్ లో 6, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో 4 చొప్పున కేసులు వెలుగు చూశాయి. ఇక, జమ్మూకశ్మీర్ లో 3. ఉత్తర్ ప్రదేశ్ లో 2, ఛతీస్ గఢ్, లఢాఖ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసులు నమోదు అయ్యాయి.

మరోవైపు ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వారిలో సాధారణ స్వల్ప లక్షణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఓమిక్రాన్ తో ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించ లేదు. అయితే దేశంలో కేసులు పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement