చెన్నై – ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 300 మంది మృతి చెందగా..900 మందికిపైగా గాయపడ్డారని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పటికీ ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉంటే తమిళనాడుకు చెందిన 42 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు..
అలాగే మరో 51 మంది గాయపడ్డారు.. గాయపడిన వారందర్ని మెరుగైన చికిత్స కోసం చెన్నైకు విమానంలో తరలించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.. అంతే కాకుండా మంత్రి ఉదయనిధి నేతృత్వంలో ఒక బృందం సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రమాద స్థలానికి చేరుకుంది.. తమిళనాడుకు చెందిన ప్రయాణీకుల వివరాలను సేకరించి వారి బంధువులకు సమాచారాన్ని చేరవేస్తున్నారు.. మంత్రి ఉదయనిధి స్వయంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవల కోసం చర్యలు చేపట్టారు.. ఇది ఇలా ఉంటే ఈ ప్రమాదంలో మరణించిన తమిళనాడు వాసులకు ఒక్కొక్కరి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష రూపాయిలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు స్టాలిన్..