Friday, November 22, 2024

దేశంపై కరోనా గ్రహణం.. ఒక్క రోజులో భారీగా పెరిగిన కేసులు

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నిన్న 30 వేల పై చిలుకు కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య మళ్లీ 40 వేలకు చేరింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 41,965 కేసులు నమోదయ్యాయి. మరో 460 మంది మహమ్మారికి బలయ్యారు. 33,964 మంది కరోనా​ను జయించారు. ఒక్క కేరళలోనే 30,203 కేసులు నమోదుకాగా.. 115 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,28,10,845కు చేరింది. ఇందులో 3,19,93,644 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తతం 3,78,181 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 4,39,020 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. తమిళనాడులో 1,512 కోవిడ్ కేసులు, కర్ణాటక 1,217, ఆంధ్రప్రదేశ్ 1,115తో రోజువారీ కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో నిన్న 338 కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గత 24 గంటల్లో 1,33,18,718 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం 65,41,13,508 డోసులను పంపిణీ చేశామని తెలిపింది. దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 16,06,785 కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్ గజినీ అవుతారు: షర్మిల

Advertisement

తాజా వార్తలు

Advertisement