దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో ఒక్కరోజులోనే కొత్తగా లక్షాకుపైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా.. సరిపడా వ్యాక్సిన్ మాత్రం అందుబాటులో లేదు. ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసిలో వ్యాక్సిన్ కొరత కారణంగా 41 ఆస్పత్రులను మూసివేశారు. ప్రస్తుతం 25 ఆస్పత్రుల్లో మాత్రమే టీకా ప్రక్రియ కొనసాగుతోంది. వారణాసి జిల్లాకు సరఫరా చేసే సెంటర్‌ను కూడా మూసివేశారు. టీకాల కొరతపై ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
లక్నో నుంచి సరఫరా అవుతున్న టీకా… క్రమంగా జిల్లాలకు తగ్గించేశారని హెల్త్ వర్కర్ శ్యామ్ జీ ప్రసాద్ తెలిపారు. వారణాసిలో కొవిడ్ టీకాకు చాలా డిమాండ్ ఉందని, ఇప్పుడు టీకా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. టీకా కొరతపై నోడల్ అధికారికి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని వైద్యాధికారులు అంటున్నారు. ఇదిఇలా ఉంటే.. వారణాసితో పాటు మహారాష్ర్ట, ఒడిశాలోనూ వ్యాక్సిన్ కొరత ఉంది.