పశ్చిమ బెంగాల్ లో బీఎస్ఎఫ్ బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. నార్త్ 24 పరగణా జిల్లాలోని ఇండియా – బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఇచ్చామతి నది వద్ద బీఎస్ఎఫ్ బలగాలు ఈరోజు ఉదయం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుంచి 40 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని సీజ్ చేశామని, దాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బంగారం విలువ రూ. కోట్లలో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital