మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఓ నాలుగేండ్ల చిన్నారిని దారుణంగా రేప్ చేసి, చెరుకు తోటలోని పొదల్లో పడేసి వెళ్లిపోయాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం) వెలుగులోకి వచ్చిందని ఖండ్వా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. నిన్న (సోమవారం) పొలాల్లోని పొదల్లో అపస్మారక స్థితిలో ఆ బాలిక కనిపించడంతో స్థానికుల సహాయంతో పోలీసులు ఇండోర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
సోమవారం ఉదయం జస్వాడిలోని తన బంధువుల ఇంటి నుంచి బాలిక కనిపించకుండా పోయిందని ఫిర్యాదు అందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. పోలీసులకు సమాచారం అందగానే అదృశ్యమైన బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విచారణలో భాగంగా లోకల్‌గా ఉండే ఓ షాపులో పనిచేస్తున్న 25 ఏళ్ల యువకుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ఆ వ్యక్తి ఆదివారం రాత్రి బాధితురాలి కుటుంబంతో పరిచయం ఉన్నవాడేనని, ఆ రాత్రి వారి ఇంటి నుంచి పడుకునేందుకు మంచాన్ని తీసుకెళ్లేందుకు వచ్చాడని ఎస్పీ తెలిపారు. కాగా, పోలీసుల ఎంక్వైరీలో బాలికను పొలానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆ వ్యక్తి అంగీకరించాడు.
అయితే.. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తొలుత జిల్లా ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స నిమిత్తం ఇండోర్‌కు తరలించినట్లు ఎస్పీ వివేక్ తెలిపారు. నిందితుడు బాలిక నిద్రిస్తున్న సమయంలో అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి.. పొలానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆ తర్వాత పొదల్లో పడేసినట్టు చెప్పారు. దీంతో నిందితుడిపై IPC 363, 376, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (POCSO) కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్టు తెలిపారు.