Monday, November 25, 2024

ఒకే రేఖ‌పై 4గ్ర‌హాలు – ఆకాశంలో పెను మార్పులు

ఈ భూ ప్ర‌పంచంలోనే కాదు..ప‌గ‌లు, రాత్రి వెలుగు నిచ్చే ఆకాశంలో కూడా ఎన్నో వింత‌లు విడ్డూరాలు చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడ‌దే జ‌రిగింది. ఒకే రేఖ‌పై నాలుగు గ్ర‌హాలు వ‌చ్చి చేరాయి.. ఆకాశం వైపు చూస్తే శుక్రుడు (వీనస్), అంగారకుడు (మార్స్) కనిపిస్తుంటారు. ఈ రెండింటి పక్కనే సమాంతర రేఖలో మరో రెండు గ్రహాలు ఏప్రిల్ లో రానున్నాయి. అవి బృహస్పతి (జూపిటర్), శనిగ్రహం (శాటర్న్). దీంతో అరుదైన గ్రహ చతుష్టయం ఆకాశంలో దర్శనమివ్వనుంది. 2020 తర్వాత ఇలా కనిపించడం ఇదే తొలిసారి. 2020లో ఇవి మానవ కంటికి నేరుగా కనిపించాయి. ఏప్రిల్ మధ్య నాటికి శుక్రుడు, అంగారకుడు సరసన బృహస్పతి వచ్చి చేరనుంది. ఏప్రిల్ చివరికి ఈ మూడింటి వరుసలోకి శని రానున్నాడు. జెట్ ప్రపోల్షన్ ల్యాబొరేటరీ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఇవి మన కంటికి చూడ్డానికి దగ్గరకు వచ్చినట్టు అనిపించినా. అంత దగ్గరగా ఉండవు. బిలియన్ల కిలోమీటర్ల దూరం వీటి మధ్య ఉంటుంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో వీటి అలైన్ మెంట్ లో వచ్చే మార్పులతో ఇలాంటి విశేషాలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడీ దృశ్యం క‌నుల పంట‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement