అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. అండమాన్ దీవుల్లో పది రోజుల వ్యవధిలో భూకంపం రావడం ఇది రెండో సారి. సోమవారం తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్‌బెల్ బే వద్ద భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. క్యాంప్‌బెల్ తీరానికి 85 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నదని తెలిపింది. కాగా, అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement