గ్రామీ అవార్డు..ఇది ప్రతిష్టాత్మకమైన అవార్డు..ఒకసారి రావడమే అరుదు..అటువంటింది ఏకంగా మూడుసార్లు ఈ అవార్డు రావడమంటే మాటలా చెప్పండి. కాగా 65 Grammy Awards 2023 ప్రదానోత్సవంలో ఈఏడాది భారతీయ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ మరోసారి ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. రిక్కీ రూపొందించిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్ కు గానూ బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ అవార్టును అందుకున్నారు. దీంతో ఇండియన్ మ్యూజిక్ లవర్స్ ఖుషీ అవుతున్నారు. ఇక రిక్కీ గ్రామీ మ్యూజిక్ అవార్డును మొదటిసారిగా 2015 అందుకున్నారు. గతేడాది 2022లోనూ ఈ అవార్డు వరించింది. ఈసారి కూడా గ్రామీ అవార్డు దక్కించుకొని మూడుసార్లు ఈ అవార్డును అందుకున్న ఏకైక భారతీయ మ్యూజిక్ కంపోజర్ గా రిక్కీ రికార్డు క్రియేట్ చేశారు. భారతదేశం నుండి గ్రామీ అవార్డును గెలుచుకున్న రిక్కీ అంతర్జాతీయంగా విడుదలైన 16 స్టూడియో ఆల్బమ్ కు పనిచేశారు.
3500కి పైగా వాణిజ్య ప్రకటనలు, సర్ డేవిడ్ అటెన్‌బరోకు చెందిన నేచురల్ హిస్టరీ డాక్యుమెంటరీ ‘వైల్డ్ కర్ణాటక’తో సహా 4 చలన చిత్రాలకు వర్క్ చేసినట్టు సమాచారం. 1981లో నార్త్ కరోలినాలో ఈయన జన్మించారు. కేజ్ పంజాబీ, మార్వాడీకి చెందిన వాడు. ఎనిమిదేండ్ల వయస్సు నుంచి బెంగళూరులోనే నివసిస్తున్నాడు. ఇక మూడోసారి కూడా అవార్డు అందుకోవడం పట్ల రిక్కీ స్పందించారు. ‘ఇప్పుడే నా 3వ గ్రామీ అవార్డును గెలుచుకున్నాను. చాలా కృతజ్ఞతలు, నేను మాట్లాడలేను! ఈ అవార్డును భారతదేశానికి అంకితం చేస్తున్నాను.’ అంటూ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ఈ ఏడాది గ్రామీ అవార్డులను అందుకున్న వారిలో.. బెస్ట్ పాప్ డ్యుయో పెర్ఫామెన్స్ కేటగిరీలో సామ్ స్మిత్, కిమ్ పెట్రాస్, సాంగ్ ఆఫ్ ది ఇయర్ – బోనీ రైట్, బెస్ట్ డాన్స్/ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఆల్బమ్ : రెనిసాన్స్ (బియాన్స్), బెస్ట్ పాప్ సోలో పెర్ఫామెన్స్ : అదెలె, బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ : కెన్ డ్రిక్ లామర్, బెస్ట్ మ్యూజిక్ అర్బన్ ఆల్బమ్ – బ్యాడ్ బన్నీస్ అన్ వెరానో సిన్టీ, బెస్ట్ కంట్రీ ఆల్బమ్ విన్నర్ : ఎ బ్యూటీఫుల్ టైమ్, బెస్ట్ ఆర్ అండ్ బీ సాంగ్ : కఫ్ ఇట్ (బియాన్స్), బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ : హ్యారీ స్టైల్స్, బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో రిక్కీ కేజ్ అవార్డును కైవసం చేసుకున్నారు.