కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలని వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కాగా మాస్క్ లంటే ఏదో నామ్ కే వాస్తే అన్నట్టుగా కాకుండా మంచివాటినే ధరించాలని వైద్యులు తెలియజేస్తున్నారు. క్లాత్ మాస్క్ వాడటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదట. ఇంకా సర్జికల్ డిస్పోజబుల్ మాస్క్ లు, ఎన్ 95మాస్క్ లు ఇలా పలు రకాలు ఉన్నాయి. అయితే ఏ మాస్క్ అయినా రెండు లేదా మూడు లేయర్ల ఫేస్ మాస్క్ లను ధరించాలని డాక్టర్స్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఒక్క లేయర్ ఉన్న క్లాత్ మాస్క్లులు పెద్ద గాలి తుంపర్లను సమర్థంగా అడ్డుకోగలవే కానీ, ఒమిక్రాన్ రకంలో మాదిరి సూక్ష్మ తుంపర్లను నిలవరించలేవని చెబుతున్నారు.
అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నిరోధక విభాగం (సీడీసీ) ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనూ మాస్కులు ధరించాలని సూచించింది.ఒకటికి మించి ఎక్కువ లేయర్లతో కూడిన క్లాత్ మాస్కు కింద డిస్పోసబుల్ మాస్కు ధరించండి. పైన పెట్టే మాస్కు కింది మాస్కు పైనుంచి గడ్డం దిగువ భాగాన్ని కవర్ చేసే విధంగా ఉండాలి’’అని సీడీసీ సూచించింది. తిరిగి వినియోగించడానికి పనికొచ్చే (రీయూజబుల్) మాస్కులను రోజుకు ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. డిస్పోజబుల్ మాస్క్ అయితే ఒక పర్యాయం వాడిన తర్వాత పడేసేయాలని సూచించింది. మాస్క్ లకి లేయర్స్ ఎక్కువగా ఉంటేనే .. సూక్ష్మ గాలి తుంపర్లు మాస్క్ నుంచి రాకుండా ఉంటాయని, వైరస్ వ్యాప్తిలోకి వెళ్లకుండా నివారించడం సాధ్యపడుతుందట. సర్జికల్ మాస్క్ తో కలిపి ఒక్క లేయర్ ఉన్న క్లాత్ మాస్క్ ను వాడుకోవచ్చని తెలిపారు. లేదంటే రెస్పిరేటరీ మాస్కులు ధరించడం మంచిదట. అప్పుడే ఒమిక్రాన్ నుంచి రక్షించుకోగలుగుతామని చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..