దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. అయితే, పలు రాష్ట్రాల్లో మాత్రం వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 38,667 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 478 మంది మరణించారు. కొత్తగా 35,743 మంది కరోనాను జయించారు. మరో 35,743 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోల్చితే కొత్తగా రికార్డయిన కేసులు 3.6 శాతం తక్కువ.
ప్రస్తుతం 3,87,673 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు చేరగా.. 3,13,38,088 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. కరోనాతో దేశవ్యాప్తంగా 4,30,732 మృతి చెందారు. రికవరీ రేటు 97.46 శాతానికి చేరగా.. క్రియాశీలక కేసులు 1.20 శాతానికి తగ్గాయి. దేశంలో ఇప్పటి వరకు 53.61 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కొత్తగా 20,452 కేసులు నమోదయ్యాయి . 16,856 మంది కోలుకోగా 114 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6,686 కొవిడ్ కేసులు నమోదు కాగా.. వైరస్ తో 158 మంది మృతిచెందారు. తమిళనాడులో 1,933, కర్ణాటకలో 1,669 మందికి కరోనా సోకింది.
ఇది కూడా చదవండిః కాంగ్రెస్ దళిత దండోరా సభ వాయిదా ?: రేవంత్ కి కోమటిరెడ్డి సహకరిస్తారా?