3,800టన్నుల బరువు ..వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న భవనాన్ని టెక్నాలజీ సహాయంతో పైకి ఎత్తి వేరే చోటుకి తరలించారు ఇంజనీర్లు. ఈ సంఘటన చైనాలోని షాంఘైలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరిగి జూలై 8న యథా స్థానంలో ఇంటిని సెట్ చేశారు. పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చింది. అది పెద్ద, బలమైన నిర్మాణాన్ని తరలించడం షాంఘైలో ఇదే మొదటిసారి. ‘3,800 టన్నుల వందేళ్లనాటి భవనం నిదానంగా కదులుతోంది’అంటూ చైనా ప్రభుత్వ అధికారి జాంగ్ మీఫాంగ్ దీని గురించి ట్వీట్ చేశారు. షాంఘైలో 2020లోనూ 85 ఏళ్లనాటి భవనాన్ని ఇలానే తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement