భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య నాలుగు వేలకు చేరువ అవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,688 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,075,864 కు చేరింది. ఇందులో మొత్తం 4,25,33377 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో దేశంలో 50 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,23,803కి చేరింది. అదే సమయంలో 2755 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 18,684 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.74 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,88,89,90,935 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.