దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్నా.. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం 34 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 35 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 281 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. 33,798 మంది వైరస్ నుంచి బయటపడ్డారని తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది. ఇందులో 3,26,32,222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,40,639 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కేరళలో 22 వేలు, మహారాష్ట్రలో 3,595 కేసులు నమోదయ్యాయి.
గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దేశంలో కరోనాబారినపడి 4,44,529 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల రేటు 1.02 శాతంగా, రికవరీ రేటు 97.65 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు.
ఇది కూడా చదవండిః ఏపీలో సెకండ్ వేవ్ సెగలు..