సాధారణంగా ఏ వస్తువయినా కొన్నాళ్లకి పాతదయి, పాడుబడిపోతాయి. అయితే 3,500 ఏళ్లవుతున్నా ఆ మమ్మీ చెక్కు చెదరకపోవడం సైంటిస్టులనే ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మమ్మీ దంతాలు కూడా పాడవలేదు, పాచి పాట్టలేదు. ముఖం రూపు మారకపోవడం గమనార్హం. ఈ మమ్మీ క్రీస్తుపూర్వం 1525 నుంచి 1504వరకు ఈజిస్ట్ ను పాలించిన రాజు ఫారో అమనోటైప్1 మమ్మీ ఇది. ఈ మమ్మీని రీసెంట్ గా కైరో యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సహర్ సలీమ్ నేతృత్వంలో సైంటిస్టులు ఈ మమ్మీని విప్పి చూశారు. అయితే ఇప్పటి వరకు ఓపెన్ చేయకుండా ఉంచిన మమ్మీ ఇదే. ఆమోస్ 1 మరణం తర్వాత అమెనోటెప్ 1 రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. దాదాపు 21 ఏళ్ల పాటు ఈజిప్ట్ ను పాలించాడు. తన సామ్రాజ్యాన్ని ఆయన కుష్, లిబియాకు విస్తరించాడని సైంటిస్టులు చెప్పారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. తొలిసారిగా 1881లో లగ్జర్ లోని డయీర్ ఎల్ బహారీ రాయల్ క్యాచెలో అమెనోటెప్ 1 మమ్మీని గుర్తించారు. అయితే, అమెనోటెప్ 1 మమ్మీని ఇప్పటివరకు తెరవకపోవడంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆ మమ్మీని తెరిచేందుకు అవకాశమే లేకుండా చాలా పక్కాగా ప్యాక్ చేసి పెట్టారని అంటున్నారు. మంచి మంచి పూల మాలలతో అలంకరించారని చెబుతున్నారు. జీవం ఉట్టిపడే మాస్క్ తో మొహాన్ని కప్పి ఉంచారని తెలిపారు.
అందుకే ఇన్నాళ్లూ దానిని ఓపెన్ చేయలేదని, ఇప్పుడూ డిజిటల్/వర్చువల్ గానే మమ్మీ కట్లను విప్పి దానిని అధ్యయనం చేశామని అంటున్నారు. 35 ఏళ్లుండే ఆ యువ రాజు మమ్మీని ఓపెన్ చేసి.. సీటీ స్కాన్లు చేశారు. ఆ రాజు చనిపోయినప్పుడు ఎంత దేహదారుఢ్యంతో ఉన్నాడో.. ఇప్పుడు కూడా అంతే గట్టిగా అది ఉన్నట్టు సైంటిస్టులు వెల్లడించారు. ఈ మమ్మీ 169 సెంటీమీటర్ల పొడవుంది. అయితే ఈ రాజుది సహజ మరణమేనట. సీటీ స్కాన్లు చేసిన మమ్మీని 2డీ, త్రీడీ చిత్రాలు తీసి.. డిజిటల్ పద్ధతిలో అమెనోటెప్ 1 మమ్మీని తెరిచారు. సన్నని దవడతో అచ్చం తన తండ్రి లాగానే ఈ రాజు ఉండేవాడని అంచనా వేశారు. ఆయన దంతాలు కొంచెం కూడా పాడు కాలేదని, ఇప్పటికీ మెరుస్తూనే ఉన్నాయని చెప్పారు. అతడు సహజంగానే మరణించినప్పటికీ.. దేనివల్ల చనిపోయాడని చెప్పేందుకు ఒంటి మీద చిన్న గాయం కూడా లేదట. అయితే, రాజు మమ్మీని సమాధి చేసిన తర్వాత సమాధుల దొంగల తవ్వకాలతో ఆయన దేహంపై కొన్ని గాయాలున్నాయని చెప్పారు. ఆయన అంతర్గత అవయవాలను తీసేసినా.. మెదడు, గుండెను మాత్రం తీయలేదని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..