మంచిర్యాల- రవీంద్రఖని స్టేషన్ల మధ్య వరద ప్రవాహానికి దక్షిణ్ ఎక్స్ప్రెస్రైలు ప్రమాదానికి గురై 35 ఏండ్లు గడిచాయి. ఈ ప్రమాదంలో 53మంది ప్రయాణికులు మృతిచెందిన విషయాన్ని సింగరేణి కోల్బెల్ట్ ప్రాంత వాసులు గుర్తుచేసుకున్నారు. భారీ వర్షాల దెబ్బకు 1987 జులై 9న తెల్లవారుజామున మందమర్రి మండలం క్యాతన్పల్లిలోని అమరవాది చెరువు కట్ట తెగింది. ఆ వరద ప్రవాహానికి 3 కిలోమీటర్ల దూరంలోని రైల్వే ట్రాక్ట్ కొట్టుకుపోయింది.
దీంతో ఉదయం 4.30 ప్రాంతంలో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న నిజామొద్దీన్ దక్షిణ్ఎక్స్ప్రెస్ దక్షిణ్ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. రెండు బోగీలు సుమారు 50 మీటర్ల దూరం కొట్టుకపోయాయి. రైలులోని 53 మంది ప్యాసింజర్లు చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. రామకృష్ణాపూర్లోని సింగరేణి కార్మికులు, అమరవాది, క్యాతనపల్లి, గద్దెరాగడి, దుబ్బపల్లి గ్రామస్తులు ప్యాసింజర్లను రక్షించారు.