Friday, November 22, 2024

చార్​ధామ్​ యాత్రలో అపశృతి.. రెండు వారాల్లో 34 మంది యాత్రికులు మృతి..

ఈనెల 3వ తేదీ నుంచి చార్​ధామ్​ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు యాత్రికులు 34 మంది చనిపోయారు. ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు వచ్చే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంది. అసాధారణ రద్దీతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికులకు ముందుగా ఒక సలహాను కూడా జారీ చేసింది. హిమాలయ దేవాలయాలకు కష్టతరమైన ట్రెక్‌ను ప్రారంభించే ముందు తమను తాము వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరింది.

ఆలయాలకు వెళ్లే మార్గంలో 18 మంది యాత్రికులు గుండెపోటుతో చనిపోయినట్టు తెలుస్తోంది. వారిలో ఎక్కువ మంది గుండెపోటు లేదా కొవిడ్ అనంతర వైద్య సమస్యల వల్ల చనిపోయారని చీఫ్ సెక్రటరీ ఎస్​ఎస్​ సంధు తెలిపారు.  ఎటువంటి మహమ్మారి ఆంక్షలు అమలులో లేనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా యాత్రికులు తీర్థయాత్ర కోసం ముందస్తుగా నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement