Friday, November 22, 2024

స్టూడెంట్స్​కి కరోనా.. వైద్య పరీక్షల్లో 41మందికి పాజిటివ్​, స్కూల్​ మూసివేత!

తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా అండిపట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో రెండు రోజుల్లో 31 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. వారికి నిర్వహించిన కొవిడ్​ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధరాణ అయ్యింది. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులతో సహా మరో 10 మందికి పాజిటివ్‌గా రావడంతో మొత్తం సంఖ్య 41కి చేరింది. అయితే.. పలువురు విద్యార్థులకు జలుబు లక్షణాలు కనిపించడంతో వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

జిల్లా అధికారులు రెండు రోజులుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న 12 మంది విద్యార్థులకు పాజిటివ్‌ రాగా.. ఇవ్వాల మరో 19 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. ఈ 31 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఇతరులతో సహా మరో 10 మంది దాకా పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 41 కి చేరుకుంది. దీంతో జిల్లా అధికారులు పాఠశాల దాని సమీప పరిసరాలను శానిటైజ్ చేయిస్తున్నారు. వచ్చే మూడు రోజుల పాటు స్కూల్​ని మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.. ఇక.. నిన్న తమిళనాడులో 2,765 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో రాజధాని నగరం చెన్నైలో 1,011, చెంగల్‌పేటలో 408, కోయంబత్తూరులో 125 కొత్త కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement