ఆయన నటుడే కాదు..నిర్మాత కూడా..హీరోయిన్ కాజోల్ ని వివాహమాడిన ఈయన బాలీవుడ్ కే కాదు టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు..స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో కీలక పాత్రని పోషిస్తున్నాడు.. ఆయనే అజయ్ దేవగన్. ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగులోకి కూడా అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గురువుగా అజయ్ కనిపించనున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న విడుదల కానుండగా, ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. సరిగ్గా ఇదే రోజు అంటే నవంబర్ 22న ఆయన తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నేటితో 30ఏళ్ళు పూర్తయింది. ఆయన తొలిచిత్రం ఫూల్ ఔర్ కాంటే.’అగర్ తేరే పాస్ జాగీర్ హై, తో మేరే పాస్ జిగర్ హై అనే డైలాగ్ తో అదరగొట్టేశాడు.
ఈ సినీ ప్రయాణంలో ‘జఖ్మ్, ఇష్క్, దిల్జాలే, హమ్ దిల్ దే చుకే సనమ్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, యువ, ఓంకార, సింగం, బోల్ బచ్చన్’ వంటి చిత్రాల్లో అత్యత్తమైన నటనకౌశాలన్ని ప్రదర్శించారు. 30 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో అజయ్ దేవగణ్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అజయ్ మృదుస్వభావి. అనవసర విషయాల్లో జోక‍్యం చేసుకోరు. ఇంకా సినిమా పట్ల మంచి అభిరుచి కలిగి ఉన్నారు. నా అభినందనలు అజయ్. మీరు మరో 70 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నా.’ అంటూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఇంకా స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ‘మనం కొత్తవారిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది. నేను నువ్వు జుహు బీచ్‌లో మార్షల్ ఆర్ట్స్ సాధన చేసేవాళ్లం. మీ నాన్న మనకు శిక్షణ ఇచ్చేవారు. ఎంత మంచి రోజులవి. అలాగే నీ మొదటి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే ‘ వచ్చి 30 ఏళ్లు అవుతుంది. సమయం గడిచిపోతుంది. కానీ స్నేహం అలాగే ఉంటుందని అక్షయ్ ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..