Wednesday, November 20, 2024

ఈజిప్ట్ లో ‘‘లాస్ట్‌ సిటీ’’.. బయటపడ్డ పురాతన నగరం!

ఈజిప్ట్ లో  మూడు వేల ఏళ్ల నాటి అతి పురాతన నగరం బయట పడింది. అతేకాదు కొన్ని అద్భుత ఘట్టాలను వెలికితీయగలిగారు. వేల ఏళ్లవుతున్నా ఆ నగరపు గోడలు చెక్కు చెదరని స్థితిలో ఉన్నాయి. సమాధులు, నివాస సముదాయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. లాస్ట్‌ గోల్డెన్‌ సిటీ అనే పేరుగల నగరాన్ని శాస్త్రవేత్తల బృందం ఈజిప్టుకు దక్షిణాన గల లక్సోర్‌లో గుర్తించింది. ఈజిప్ట్‌లో గతంలో బయటపడిన టుటన్ఖమాన్‌ సమాధి తర్వాత ఈ పట్టణం అత్యంత ప్రాముఖ్యత కలిగినది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పట్టణం పేరు ‘అటెన్’.

ఈజిప్ట్ లో ఇప్పటిదాకా గుర్తించిన పురాతన నగరాల్లో ఇదే అతిపెద్దదని శాస్త్రవేత్తలు చెప్పారు. దాదాపు ఏడు నెలల పాటు సాగిన తవ్వకాల్లో నగరంతో పాటు ఎన్నో ఆభరణాలు, మట్టి ఇటుకలను వెలికి తీశారు. . నివాస సముదాయాల్లోని ఇళ్లలో ప్రజలు నిత్యం వాడే పనిముట్లు, మట్టి పొయ్యిలు, కుండలు, పూలు పెట్టుకునే వాజులు, నాటి మనుషుల అస్థిపంజరాలను గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement