Saturday, November 23, 2024

Agnipath: డిసెంబర్​లో 3వేల మంది అగ్నివీర్​ల చేరిక.. ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​లో స్పెషల్​ ట్రైనింగ్​ ​

అగ్నిపథ్​ పథకం ద్వారా రిక్రూట్​ అయిన అగ్నివీర్​లను ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​లో చేర్చుకోనున్నట్టు ఐఏఎఫ్​ చీఫ్​మార్షల్​ వివేక్​ రామ్​ చౌదరి చెప్పారు. వారి తొలి శిక్షణ కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో 3000 మంది అగ్నివీరులను తీసుకుంటున్నామని శనివారం తెలిపారు. భారత వైమానిక దళం (IAF) 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ప్రతి అగ్నివీరుడు IAFలో వృత్తిని ప్రారంభించడానికి సరైన నైపుణ్యాలు, టెక్నాలజీ కలిగి ఉండేలా వైమానిక దళం వారి కార్యాచరణ శిక్షణా పద్ధతిని మారుస్తుందని ఎయిర్ చీఫ్ VR చౌదరి తెలిపారు. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.

వచ్చే ఏడాది నుంచి మహిళా అగ్నివీరుల రిక్రూట్​మెంట్​పై కూడా IAF యోచిస్తోందని, మౌలిక సదుపాయాల కల్పన పురోగతిలో ఉందని చౌదరి చెప్పారు. అధికారుల కోసం ఆయుధ వ్యవస్థల శాఖను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొత్త కార్యాచరణ శాఖను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని వెల్లడించారు ఎయిర్​ చీఫ్​ మార్షల్​ చౌదరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement