పంజాబ్లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 92 చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక… మార్పులు చేపడుతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. అయితా తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రజలకు బంపర్ ఆపర్ ఇచ్చారు. ఇంటింటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తాజాగా ప్రకటించింది. జులై 1 నుంచి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం కల్లా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 16న శుభవార్త వింటారని సీఎం భగవంత్ మాన్ గురువారం వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తుంది ఆప్ ప్రభుత్వం.
Advertisement
తాజా వార్తలు
Advertisement