రాజకీయాల్లో తండ్రి బాటలో వారుసలు రావడం సహజమే. అయితే, తండ్రి చేపట్టిన పదవిని తనయులు చేపట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ అరుదైన ఘనతనే సొంతం చేసుకున్నారు. తన తండ్రి మాధవరావ్ సింధియా రాజకీయ జీవితంతో జ్యోతిరాదిత్య సింధియాకు చాలా పోలికలే ఉన్నాయి. గతేడాది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా.. బుధవారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకున్న జ్యోతిరాదిత్య సింధియాకు పౌర విమానయాన శాఖ కేటాయించారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట ఆయన తండ్రి మాధవరావ్ సింధియా కూడా ఆదే బాధ్యతలు నిర్వర్తించారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌గా మాధవరావ్ సింధియా పని చేశారు. 1991 నుంచి 1993 మధ్య ఆయన ఈ శాఖా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఆయన తనయుడు జ్యోతిరాదిత్య సింధియా కూడా పౌర విమానయాన శాఖ బాధ్యతలను చేపట్టారు.
తన తండ్రి మాధవరావ్ సింధియా రాజకీయ జీవితంతో జ్యోతిరాదిత్యకు చాలా పోలికలే ఉన్నాయి. తండ్రీతనయులు మాధవరావ్, జ్యోతిరాదిత్య ఇద్దరూ ఈ శాఖలు చేపట్టక ముందు కూడా కేంద్ర మంత్రులుగా పని చేసిన వాళ్లే కావడం ఇక్కడ మరో విశేషం. పౌర విమానయాన శాఖ చేపట్టకముందు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు మాధరావ్ సింధియా. జ్యోతిరాదిత్య కూడా గతంలో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పని చేశారు.
ఇది కూడా చదవండి:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఇలా