Monday, November 18, 2024

ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగా 30 కిలోల బియ్యం

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉచిత బియ్యం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 1.47 కోట్ల తెల్లరేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. 88 లక్షల మందికి ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కానీ కేంద్రం లబ్ధి అందని 59 లక్షల కార్డుదారులకు మే, జూన్ నెలల్లో ఉచిత బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి లబ్ధిదారుడికి మేలో 10 కిలోలు, జూన్‌లో 10 కిలోల చొప్పున పంపిణీ చేయనుంది. ప్రస్తుతం ఇస్తున్న తరహాలోనే రేషన్ వాహనాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది. రెండుసార్లు కాకుండా ఒకేసారి డబుల్ కోటా పంపిణీ చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బియ్యం పంపిణీ కోసం రూ.764 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement