హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణం జరిగింది. బంజారాహిల్స్ లోని ఓ మాల్‌లో మూడేళ్ల బాలిక చేయి జాయ్‌రైడ్ ఆపరేటింగ్ మెషీన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె చేతి వేళ్లు తొలగించిన విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న (శనివారం) మధ్యాహ్నం మెహ్విష్ లుబ్నా.. తన తల్లిదండ్రులు సయ్యద్ మక్సూద్ అలీ, మెహతాబ్ జహాన్‌తో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం.1లో ఉన్న సిటీ సెంటర్ మాల్‌కి వెళ్లారు. ఆ చిన్నారిని మాల్‌లో ఉన్న “స్మాష్ జోన్”లోని జాయ్‌రైడ్‌లో కూర్చోబెట్టారు.
కాగా, జాయ్‌రైడ్‌లోని ఆపరేటింగ్ మెషీన్‌లో ఆ పాప కుడి చేయి ఇరుక్కుపోయి నలిగిపోయింది. ఘటనను గమనించిన బాలిక తల్లిదండ్రులు సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత డాక్టర్లు ఆమె మూడు వేళ్లు పూర్తిగా క్రష్ కావడంతో ఆపరేషన్ చేయలేక పోయారు. అయితే.. ఈ ఘటన జరిగిన తర్వాత మాల్ యాజమాన్యం చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లల భద్రతకు ఆ మాల్‌లో ఎట్లాంటి ముందస్తు చర్యలు లేవన్నారు. అందుకే ఈ విషయమ్మీద పోలీసులకు ఫిర్యాదు చేశామని బాలిక తండ్రి సయ్యద్ మక్సూద్ అలీ తెలిపారు. సిటీ సెంటర్ మాల్ యాజమాన్యంపై బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.