జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ సమీపంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో రాత్రి స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా పొద్దుపోయిన తర్వాత గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని కశ్మీర్ IGP విజయ్ కుమార్ తెలిపారు. వారిలో ఒకరిని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సుహైల్ అహ్మద్ రాథర్‌గా గుర్తించామన్నారు. రెండు రోజుల వ్యవధిలో జమ్ముకశ్మీర్‌లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేశాయి. అయితే ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో యుద్ద సామాగ్రి, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital