ఎంత కట్టడి చేసినా గోల్డ్ స్మగ్లింగ్ కి అడ్డుకట్టవేయలేకపోతున్నారు..కాగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భారీగా అక్రమ బంగారం పట్టుబడుతూనే ఉంది. దేశంలో పసిడికి మంచి డిమాండ్ ఉండటంతో అక్రమార్కులు వివిధ మార్గాల్లో పసిడిని తరలిస్తున్నారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో అధికారులు విమానాశ్రయాల్లో బంగారాన్ని పట్టుకుంటున్నారు. తాజాగా ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు కిలోల బంగారం పట్టుబడింది. అడిస్ అబాబా నుంచి ముంబై వచ్చిన విదేశీ ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీచేశారు. ఈ సందర్భంగా వారివద్ద మూడు కిలోల బంగారం లభించింది. దాని విలువ రూ.1.40 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. లోదుస్తులు , బూట్లలో తరలిస్తున్నారని వెల్లడించారు. ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు కస్టమ్స్ అధికారులు.
Advertisement
తాజా వార్తలు
Advertisement