Friday, November 8, 2024

ముగ్గురు మాజీ సీఎంల హౌస్ అరెస్ట్ – ఎందుకంటే

జ‌మ్మూ క‌శ్మీర్ ప్ర‌భుత్వం ముగ్గురు మాజీ ముఖ్య‌మంత్రుల‌ను హౌజ్ అరెస్ట్ చేసింది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న క‌మిష‌న్ ప్ర‌తిపాద‌న‌ల‌ను నిర‌సిస్తూ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్న కార‌ణంగానే వారిని హౌజ్ అరెస్ట్ చేశారు. కాగా రీసెంట్ గా జరిగిన నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ గుప్ కార్ అల‌యెన్స్ త‌ర‌పున నిర‌స‌న‌కి దిగుతామ‌ని మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా వెల్ల‌డించారు. దాంతో వారిని హౌజ్ అరెస్ట్ చేశారు.

వారి ఇళ్ల వ‌ద్ద అటు వైపు వెళ్లే రోడ్ల వ‌ద్ద గ‌ట్టి బందోబ‌స్త్ ని ఏర్పాటు చేశారు. ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుభోదయం 2022సంవ‌త్స‌రానికి స్వాగ‌తం..ఎప్ప‌టిలాగే ప్ర‌భుత్వ అక్ర‌మంగా ప్ర‌జ‌ల్ని ఇంట్లో బంధించారు. శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న మా ఇళ్ళ ముందు పోలీసువాహ‌నాల‌తో గ‌స్తీ కాస్తున్నార‌ని ట్వీట్ చేశారు. కాగా జ‌మ్మూ కాశ్మీర్ లో ప్ర‌స్తుతం 83నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వాటిని 90కి పెంచాల‌ని నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న క‌మిష‌న్ ప్ర‌తిపాదించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement