అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 2కే, 5కే రన్ నిర్వహించారు. హైదరాబాద్ సిటీ పోలీస్, భరోసా, షీ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్ కు మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ మీదుగా లేపాక్షి వరకు 5 కే రన్… పీవీ, ఎన్టీఆర్ మార్గ్ వరకు జరిగిన 2 కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని చెప్పడానికే రన్ నిర్వహించామని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా మొదటి మహిళా లా అండ్ ఆర్డర్ SHOను నియమిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలో 80 మంది మహిళా ఎస్సైలు విధుల్లో ఉన్నారన్నారు. మహిళల భద్రతపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టి షీటీమ్స్ నుఏర్పాటు చేశారని మంత్రి సబిత అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement