దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తగ్గుమఖం పట్టింది. నిన్నటితో పోలిస్తే.. ఈరోజు మూడు వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 1,39,814 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,961 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,49,67,250కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 30,041 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,44,05,550 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,659కి ఎగబాకింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.07 శాతం యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.