గుజరాత్లో మరోమారు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 260 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.1,300 కోట్లు ఉంటుందని తెలిపారు. కచ్ జిల్లాలోని కండ్లా పోర్టుకు సమీపంలో ఉన్న కంటెయినర్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించగా ఓ కంటెయినర్లో భారీగా డ్రగ్స్ వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను కంటైనర్లలో భారత్‌కు తరలిస్తున్నట్లు గుజరాత్ ఏటీఎస్‌కు సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు ATS మరియు DRI సంయుక్తంగా ఒక కంటైనర్ నుండి ఈ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement