తాలిబన్లు రాజ్యమేలుతున్న ఆఫ్ఘనిస్థాన్లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ఘటనలో ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తుర్కమెనిస్తాన్ కు సరిహద్దు ప్రాంతంలోని క్వాదిస్, ముకుర్ లో ఈ భూకంపాలు సంభవించాయి. భూ ప్రకంపనలకు ప్రజలు ఒక్క సారిగా భయ భ్రాంతులకు గురయ్యారని.. ఇళ్ల లోంచి బయటకు పరుగులు తీశారని స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలకు వెళ్లిన సిబ్బంది మధ్యలోనే చిక్కుకు పోయారు. మంగళవారం మరిన్ని సహాయక బృందాలను ఘటనా స్థలా లకు పంపనున్నట్లు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement