ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలై 100 రోజులు పూర్తి చేసుకుంది. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో పౌర ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాను హస్తంగతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న తాలిబన్ దళాలు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తాలిబన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫ్ఘన్ లో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది.
దేశంలో స్త్రీల హక్కులను తాలిబన్లు అణచివేస్తున్నారు. వారి స్వేచ్ఛకు సంకేళ్లు విధించారు. మానవ హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ, విద్యా హక్కులను ఆఫ్ఘన్ మహిళలు, బాలికలకు తాలిబన్లు దూరం చేశారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. తాలిబన్ల పాలనలో ఇప్పటి వరకు 257 మీడియా సంస్థలు మూసివేయబడ్డాయి. 70 శాతం మంది మీడియా ఉద్యోగులు దేశం విడిచి వెళ్లిపోయారు. తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాలిబన్ల అరాచకంతో ఇప్పటి వరకు 150 మందికిపైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..