దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే, నిన్నటితో పొల్చితే తాజాగా కేసులు సంఖ్య తగ్గింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనాతో 614 మంది ప్రాణాలు కోల్పోయారు.
గడిచిన 24 గంటల్లో మొత్తం 2,67,753 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 22,36,842 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,97,99,202కి చేరింది. ఇందులో మొత్తం 3,70,71,898 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,90,462కు పెరిగింది.
మరోవైవు దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కూడా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 62,29,956 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,92,09,308కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.