చిన్నపాముని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది..అటువంటిది 30అడుగుల పాటుని చూస్తే అమ్మో గుండె ఆగిపోవాల్సిందే. అలాంటి అతిపెద్ద పాము ఒకటి రోడ్డు దాటుతూ కెమెరాకి చిక్కింది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఒడిశాలోని నబరంగపూర్ జిల్లాలో ఈ పాము కనిపించింది. అది 25 నుంచి 30 అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. కత్తిగూడ జవహర్ నవోదయ విద్యాలయ సమీపంలో రోడ్డు దాటుతుండగా స్థానికులు గుర్తించారు. పాము రోడ్డున ఆ చివరకు చేరుకున్నా దాని సగ భాగం ఇంకా ఇవతలివైపున ఉండడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ అతిపెద్ద సర్పాన్ని చూశాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు హడలిపోతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement