Tuesday, November 26, 2024

24క్యార‌ట్ గోల్డ్ ఐస్ క్రీమ్ – ఎక్క‌డో తెలుసా

ఐస్ క్రీమ్ లో ఎన్నో ప్లేవ‌ర్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే మీకు 24క్యార‌ట్ గోల్డ్ తో చేసిన ఐస్ క్రీమ్ గురించి మీకు తెలుసా. ఇంత‌కీ ఈ 24క్యార‌ట్ గోల్డ్ ఐస్ క్రీమ్ ఎక్క‌డ దొరుకుతుందో తెలుసా హైద‌రాబాద్ లో. బంజారాహిల్స్ లో ఈ ఐస్ క్రీమ్స్ దొరుకుతున్నాయ‌ట‌. అది కూడా అందుబాటు ధ‌ర‌లోనేనండోయ్. బంజారాహిల్స్ లోని ఐస్ క్రీమ్ పార్లర్ లో వందలాది రకాలైన ఐస్క్రీమ్లు లభిస్తాయి. కానీ ఈ పార్లర్ కి ప్రత్యేక తీసుకొచ్చింది మాత్రం మినీ మిడాస్ ఐస్క్రీమ్. వివిధ ఫ్లేవర్ లలో రుచికరంగా ఐస్ క్రీమ్ తయారు చేసిన తర్వాత చివరకు 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ ను అలంకరణగా అమరుస్తారు. దీంతో ఒక్కసారిగా ఐస్క్రీం కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. అద్భుతమైన రుచి.. అందమైన రూపు కలిగిన ఈ ఐస్ క్రీమ్.. దాన్ని అందించే ఐస్ క్రీం పార్లర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది.

బంగారాన్ని తినొచ్చా.. అనే సందేహం వద్దు. పురాణ కాలంనుంచి నేటివరకు బంగారం శరీరానికి మంచిది అని అనేకమంది వైద్యులు చెబుతూనే ఉన్నారు. అలాగని బంగారాన్ని కొరుక్కుతినడం కాదు. కొద్ది మొత్తంలో ఓ పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలా ఈ ఐస్క్రీమ్ అలంకరణ లో ఉపయోగించే గోల్డ్ ఫాయిల్ ఎడిబుల్ అని పార్లర్ నిర్వాహకులు అంటున్నారు. ఈ ఐస్ క్రీమ్ 500 రూపాయల దగ్గర నుంచి లభిస్తుంది. గత నాలుగేళ్లుగా ఈ ఐస్క్రీం ఇక్కడ అందిస్తున్నారు. కాగా మరోసారి సోషల్ మీడియాలో ఈ ఐస్క్రీమ్ ట్రెండ్ గా మారింది. మ‌రి మీరు ఒకసారి టేస్ట్ చేయండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement