Wednesday, November 20, 2024

22దేశాల్లో ఒమిక్రాన్ కేసులు .. ఆందోళ‌న‌లో ప్ర‌భుత్వాలు ..

ఓమిక్రాన్ ఇప్పుడు ప్ర‌పంచ‌దేశాల‌న్నింటినీ వ‌ణికిస్తున్న పేరు.. ఇది క‌రోనాకి కొత్త రూపం. ఈ ఓమిక్రాన్ రోజు రోజుకి ప‌లు దేశాల్లో విస్త‌రిస్తుంది. దాంతో ప‌లు దేశాల స‌రిహ‌ద్దుల‌ని మూసివేసే ప‌రిస్థితి నెల‌కొంది. విమానాలను కూడా ర‌ద్దు చేస్తున్నారు. కాగా ఈ ఓమిక్రాన్ కేసులు 22దేశాల్లో బ‌య‌ట‌ప‌డ్డాయి. రీసెంట్ గా సౌదీ అరేబియాలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ కరోనా కేసు నమోదైంది. నిన్న జపాన్ లో కూడా ఓమిక్రాన్ కేసు బ‌య‌ట‌ప‌డింది. కాగా ఓమిక్రాన్ విస్తరించిన దేశాలు ఏంటో చూద్దాం… ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బోట్స్వానా, బ్రెజిల్, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, జర్మనీ, హాంకాంగ్, ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, నైజీరియా, పోర్చుగల్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యూకే. ఈ దేశాల్లో ప్రస్తుతం కేసులు నమోదు కావడంతో ఆయా దేశాల ప్ర‌భుత్వాలు ఆందోళ‌న‌కి గురి అవుతున్నాయి. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. మాస్క్ త‌ప్ప‌ని స‌రిగా ధ‌రించాల‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement